పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-12-16T00:29:19+05:30 IST
సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతూ వైసీపీ పాలకులు వివిధ రకాల వస్తువులపై ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వైసీపీ పాలనపై ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు ఫైర్
గార్లదిన్నె, డిసెంబరు 15: సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతూ వైసీపీ పాలకులు వివిధ రకాల వస్తువులపై ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. గురువారం గార్లదిన్నెలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అమాంతం పెంచేసి పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో ఇసుక దొరక్క ఎంతోమంది కార్మికులు కష్టాలు పడుతున్నారన్నారు. రైతులకు సబ్సిడీలు ఎత్తేసి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం, మన భవిష్యత బాగుపడాలంటే చంద్ర బాబునాయుడుతోనే సాధ్యమతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుర్రం ఆదినారాయణ, కన్వీనర్ పాండు, తెలుగుయువత అధ్యక్షుడు శ్రీనాథ్నాయుడు, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాసులు, క్లస్టర్ ఇంచార్జులు ఆవుల శీనా, అంజి, గ్రామ అధ్యక్షులు రామాంజి, నరసింహారెడ్డి, చితంబరప్ప, వెంకట్రామిరెడ్డి, రామకృష్ణ, బాలకృష్ణ, అశోక్, వెంకటేసు, పుల్లన్న, తదితరులు పాల్గొన్నారు.