అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2022-09-29T05:25:21+05:30 IST
అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, గుట్కా, పేకాటపై ఉక్కుపాదం మో పుతామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.
ఎస్పీ ఫక్కీరప్ప
కుందుర్పి, సెప్టెంబరు 28 : అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, గుట్కా, పేకాటపై ఉక్కుపాదం మో పుతామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. బుధవారం కుందుర్పి పోలీస్‌స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం పలురికార్డులను తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదకరంగా వ్యవహరించాలన్నారు. అనవసరంగా ఎవ్వరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించరాదని సూచించారు. మండల పరిధిలోని గ్రామాల్లోని పలు పరిస్థితులపై ఎస్ఐను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఐ క్రిష్ణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ శంకర్‌నారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.