పాలసముద్రంలో 600 లీటర్ల డీజిల్‌ సీజ్‌

ABN , First Publish Date - 2022-12-15T00:09:51+05:30 IST

మండలంలోని హిందూపురం ప్రధాన రహదారిపై పాలసముద్రం వద్ద రోడ్డుపై ఓ ట్రాక్టర్‌లో ఉంచి 600లీటర్ల డీజిల్‌ను అధికారులు సీజ్‌ చేశారు.

పాలసముద్రంలో 600 లీటర్ల డీజిల్‌ సీజ్‌

గోరంట్ల, డిసెంబరు 14: మండలంలోని హిందూపురం ప్రధాన రహదారిపై పాలసముద్రం వద్ద రోడ్డుపై ఓ ట్రాక్టర్‌లో ఉంచి 600లీటర్ల డీజిల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ రంగనాయకులు ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు మూడు డ్రమ్ముల్లోని డీజిల్‌, ట్రాక్టర్‌తో పాటు ఇద్దరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల నుంచి తహసీల్దార్‌ హిందూపురం వెళ్తుండగా పాలసముద్రం దాటిన తరువాత అనుమానాస్పదంగా ఉన్న ఓ ట్రాక్టర్‌ను తహసీల్దార్‌ గుర్తించాడు. ఆ సమయంలో ట్రాక్టర్‌లో ఎవరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత కాసేపటికి ట్రాక్టర్‌ వద్దకు ఐదు లీటర్ల క్యానలో డీజిల్‌తో వచ్చిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు జార్ఖండ్‌ వాసులని, నాసిన కంపెనీలో వారు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-12-15T00:09:52+05:30 IST