‘ఉన్నం’ అన్న క్యాంటీనకు 200 రోజులు
ABN , First Publish Date - 2022-12-15T00:10:47+05:30 IST
కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ఉచిత అన్న క్యాంటీనను ఏర్పాటు చేసి బుధవారం నాటికి 200 రోజులు పూర్తయింది.
నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసిన ఉన్నం, తనయులు
నిర్విరామంగా కొనసాగిస్తామన్న హనుమంతరాయ చౌదరి
కంబదూరు (కళ్యాణదుర్గం), డిసెంబరు 14: కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ఉచిత అన్న క్యాంటీనను ఏర్పాటు చేసి బుధవారం నాటికి 200 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డీటీ ఆసుపత్రి వద్ద నిరుపేదలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఉన్నం హనుమంత రాయచౌదరి, ఆయన కుమారులు ఉన్నం మారుతీచౌదరి, ఉదయ్ చౌదరి కేక్‌ను కట్ చేశారు. 200 రోజులు పూర్తి చేసుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేసి, స్వీట్లను పంచిపెట్టారు. అనంతరం ఎన్టీఆర్ భవన వద్ద కూడా నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఉన్నం మాట్లాడుతూ ఈ అన్న క్యాంటినను నిర్విరామంగా కొనసాగిస్తామని తెలిపారు. ఎంతో మంది నిరుపేదలు, విద్యార్థులు, రోగు లు, బంధువులు ప్రతిఒక్కరూ ఈ అన్న క్యాంటీనతో కడుపునిండా భోజనం చేస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్ర మంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన చౌళం మల్లికార్జున, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ మెంబర్ ఆర్జీ శివశంకర్, వైపీ రమేష్, ఆవుల తిప్పేస్వామి, గాజుల శ్రీరాములు, పాపంపల్లి రామాంజినేయులు, గోళ్ల వెంకటేశులు, డీకే రామాంజినేయులు, కొల్లాపురప్ప, నారాయణ, దండా వెంకటేశులు, వాల్మీకి ప్రియాంక, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.