మండల పరిషత్‌లో జడ్పీ సీఈవో తనిఖీ

ABN , First Publish Date - 2021-08-22T05:04:05+05:30 IST

మండల పరిషత్‌లో జడ్పీ సీఈవో తనిఖీ

మండల పరిషత్‌లో జడ్పీ సీఈవో తనిఖీ
నిర్మాణం నిలిచిన సమావేశ హాల్‌ను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో దిలీ్‌పకుమార్‌

యాచారం: మండల పరిషత్‌ను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌.దిలీ్‌పకుమార్‌ శనివారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఏడాదిన్నరగా ఆగిన సమావేశ హాల్‌ను పరిశీలించి నిర్మాణానికి ఎంత వ్యయమవుతుందని ఏఈ రాంసింగ్‌ఠాకూర్‌తో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. ఇందుకు రూ. 15లక్షలు అవుతుందని ఎంపీపీ సుకన్య సీఈవో దిలీ్‌పకుమార్‌ దృష్టికి తేవడంతో త్వరలో నిధులు విడుదల చేయించి హాల్‌ను పూర్తిచేయించడం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రారంభానికి నోచుకోని అతిథి గృహాన్ని ఆయన పరిశీలించారు. కిటికీలు వేయించాల్సి ఉందని సీఈవో చెప్పారు. ఎంపీటీసీ ఎన్నికల ఖ ర్చు వివరాల సమర్పణపై ఆరా తీశారు. ఆయన వెంట జడ్పీటీసీ చిన్నోళ్ల జంగ మ్మ, ఎంపీడీవో మమతాబాయి, ఇతర సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-08-22T05:04:05+05:30 IST