అపవాదు మోపారని.. అవమానభారంతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-03T04:57:35+05:30 IST

అపవాదు మోపారని.. అవమానభారంతో యువకుడి ఆత్మహత్య

అపవాదు మోపారని.. అవమానభారంతో యువకుడి ఆత్మహత్య

కందుకూరు: పక్కింటి వారు అపవా దు మోపి కర్రలతో చితకబాదడంతో అవ మానకరంగా భావించిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కందుకూరు మండలం పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ లిక్కి కృష్ణంరాజుకు మృతుడి కుటుంబీకులిచ్చిన ఫిర్యాదు మేర కు వివరాలిలా ఉన్నాయి..  కొత్తగూడకు చె ందిన బొక్క నర్సింహారెడ్డికి ముగ్గురు కుమారులు. ఆదివారం ఉదయం 9గంటల కు పెద్ద కుమారుడు జంగారెడ్డి వృత్తి రీత్యా నగరంలో ఓ ప్రవేట్‌ కంపెనీలో జాబ్‌కి వెళ్లా డు. చిన్న కొడుకు తన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి-పద్మమ్మతో కలి సి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. రెండో కొడుకు విజయ్‌కుమార్‌రెడ్డి(28) ఇంట్లో ఉన్నాడు. అతడు పక్కి ంట్లోని ఓ మహిళను కిటికీలోంచి చూశాడనే అనుమానంతో ఆమె బంధువులు విజయ్‌కుమార్‌రెడ్డిని కట్టెలతో తీవ్రంగా కొట్టారు. అవమానంగా భావించి న విజయ్‌కుమార్‌రెడ్డి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నా డు. విజయ్‌కుమార్‌ ఒంటిపై తీవ్రగాయాలు గుర్తిం చిన కుటుంబీకులు పక్కించి వారు కొట్టడం వల్లే ఉరేసుకున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలి పారు. విజయ్‌కుమార్‌ అన్న జంగారెడ్డి ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఎస్సై స్వామి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-05-03T04:57:35+05:30 IST