పట్టణాభివృద్ధికి మరింతగా కృషి

ABN , First Publish Date - 2021-01-12T05:55:46+05:30 IST

పట్టణాభివృద్ధికి మరింతగా కృషి

పట్టణాభివృద్ధికి మరింతగా కృషి
ర్యాలీలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది

వికారాబాద్‌: వికారాబాద్‌ పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న ట్లు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌ అన్నారు. సోమవారం స్వచ్ఛ సర్వేక్షన్‌పై చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి, బీజేఆర్‌ చౌరస్తా మీదుగా ఎంఆర్‌పీ చౌరస్తా వరకు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనంద్‌, విశిష్ట అతిథిగా అడిషనల్‌ కలెక్టర్‌ చం ద్రయ్య హాజరయ్యారు. 2020లో వికారాబాద్‌ మునిసిపల్‌ స్వ చ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణ రాష్ట్రంలో 7వ ర్యాంకు, సౌతిండి యాలో 67వ ర్యాంక్‌ సాధించిందన్నారు. మరింత మెరుగైన ర్యాంక్‌ సాధిద్దామని పిలుపునిచ్చారు. అందుకు మునిసిపల్‌ కార్మికులు మాత్రమే కష్టపడితే సరిపోదని, అందరం కష్టపడితేనే ఇది సాధ్యమన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ భోగేశ్వ ర్లు, మాజీ వైస్‌చైర్మన్‌ రమేష్‌, సొసైటీ చైర్మన్‌ ముత్యంరెడ్డి, కౌన్సి లర్లు, కోఆప్షన్‌ సభ్యుడు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-12T05:55:46+05:30 IST