అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-11-27T05:16:50+05:30 IST

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

దౌల్తాబాద్‌: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన దౌల్తాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా బీదర్‌ గేటు గ్రామానికి చెందిన ఉషేనమ్మ(28)కు ఏడాది క్రితం దౌల్తాబాద్‌కు చెందిన భీమప్పతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. ఇటీవలే తల్లిగారింటి నుంచి దౌల్తాబాద్‌కు వచ్చింది. గురువారం రాత్రి బహిర్భూమికి అని వెళ్లింది. ఆమె ఎంతకూ రాకపోవడంతో కుటుంబీకులు వెతకినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం గ్రామ శివారులో ఉషేనమ్మ మృతదేహాన్ని గుర్తించారు. ఉషేనమ్మ తల్లి ఆశమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేశామని ఏఎస్సై బాలకిషన్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-27T05:16:50+05:30 IST