‘ప్రజాసమస్యలపై పోరాడితే ఇబ్బందులకు గురిచేస్తారా?’

ABN , First Publish Date - 2021-12-07T05:30:41+05:30 IST

‘ప్రజాసమస్యలపై పోరాడితే ఇబ్బందులకు గురిచేస్తారా?’

‘ప్రజాసమస్యలపై పోరాడితే ఇబ్బందులకు గురిచేస్తారా?’

తాండూరు రూరల్‌: ప్రజా సమస్యలపై పోరాడితే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని దస్తగిరిపేట్‌కు చెం దిన బి.అంబ్రేష్‌ సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరులోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చిన్న నిరసన తెలిపితే పోలీసులు తనను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారని వాపోయారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా ఉన్న తనను సస్పెండ్‌ చేశారని తెలిపారు. సమస్యలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నిరసన తెలపడం జరిగిందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని ఆయన అన్నాడు.

Updated Date - 2021-12-07T05:30:41+05:30 IST