రేవంత్‌ ఆదేశిస్తే యాక్టివ్‌గా పనిచేస్తా

ABN , First Publish Date - 2021-10-15T04:47:52+05:30 IST

రేవంత్‌ ఆదేశిస్తే యాక్టివ్‌గా పనిచేస్తా

రేవంత్‌ ఆదేశిస్తే యాక్టివ్‌గా పనిచేస్తా
రేవంత్‌రెడ్డితో మాట్లాడుతున్న బండ్ల గణేష్‌, మల్లు రవి

  • సినీ నిర్మాత బండ్ల గణేష్‌ 

షాద్‌నగర్‌ : రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే కాంగ్రెస్‌ పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బుచ్చిగూడ గ్రామ మాజీ సర్పంచ్‌ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా భోజన సమయంలో రేవంత్‌రెడ్డి, మల్లు రవి, బండ్ల గణేష్‌ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని మల్లు రవి బండ్ల గణే్‌షను కోరారు. రేవంత్‌రెడ్డి పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్నందున మీరు కూడా పార్టీలో యాక్టీవ్‌ రోల్‌గా ఉండాలని ఆయనను కోరారు. దీనికి బండ్ల గణేష్‌ సానుకూలంగా స్పందించారు. 

ప్రతిభ ఉన్నవారికి సినీ పరిశ్రమలో అవకాశం 

సినీ పరిశ్రమపట్ల ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి అవకాశం కల్పిస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తెలిపారు. షాద్‌నగర్‌ పట్టణం నుంచి కనీసం 500 మందికి సినీ పరిశ్రమలో అవకాశం కల్పించాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురువారం జర్నలిస్ట్‌ ఖాజాపాషా నటించిన గోలీమార్‌ సినిమా పాటను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు ఖాజాపాషా, కొరియోగ్రాఫర్‌ కోనేటి రాజు, రెహమాన్‌, ఖాదర్‌గోరే, తదితరులు పాల్గొన్నారు.

తాండ్ర సులోచనమ్మకు నివాళి

బుచ్చిగూడ గ్రామ మాజీ సర్పంచ్‌ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్థంతి సందర్భంగా సులోచనమ్మ కుమారుడు కాశీనాథ్‌రెడ్డి ఆహ్వానం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీర్లపల్లి శంకర్‌, శ్రీనివా్‌సయాదవ్‌, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-15T04:47:52+05:30 IST