కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు

ABN , First Publish Date - 2021-10-30T04:10:32+05:30 IST

కొత్తగా ఉద్యోగాలు కల్పిం చాల్సింది పోయి..

కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు
మంచాలలో జరిగిన మాటాముచ్చట కార్యక్రమంలో మాట్లాడుతున్న షర్మిల

  • రోడ్డున పడిన 30వేల మంది ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు
  • ఆ కుటుంబాల ఆర్తనాదాలు సీఎం కేసీఆర్‌కు వినపడటం లేదా..?
  • ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల


ఇబ్రహీంపట్నం / మంచాల : కొత్తగా ఉద్యోగాలు కల్పిం చాల్సింది పోయి.. ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారని.. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని వైఎస్‌ఆర్‌టీపీ అధి నేత్రి వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర పదోరోజు శుక్రవారం ఇబ్రహీంపట్నం నుంచి మొదలై సీతా రాంపేట్‌, నోముల, లింగంపల్లి క్రాస్‌రోడ్డు, మంచాల, చాంద్‌ ఖాన్‌గూడ క్రాస్‌రోడ్‌, అస్మత్‌పూర్‌ క్రాస్‌రోడ్‌ మీదుగా 14 కిలోమీటర్లు సాగి సాయంత్రానికి జాపాలకు చేరుకుంది. మంచాలలో మాటాముచ్చట కార్యక్రమంలో ఆమె ప్రజల కష్ట సుఖాలు ఆలకించారు. ఈసందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లా డుతూ.. 15ఏళ్లుగా ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 30వేల మందిని ఉన్నఫలంగా తొలగించడంతో రోడ్డునపడ్డారని, ఆ కుటుంబాల ఆర్తనాదాలు కేసీఆర్‌కు వినప డడం లేదా అని మండిపడ్డారు. 1200మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటే సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన కేసీఆర్‌ పేదలకే చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక ఏడేళ్లుగా లక్షలాదిమంది నిరు ద్యోగులు గోస తీస్తున్నారని, తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఊడిగం చేయించుకునేందుకే పోలీసు ఉద్యోగాలను కొంతమేర భర్తీ చేశారని చెప్పారు. ఒక ఇంట్లో వృద్ధుల పొట్టలు వేరైనప్పటికీ.. ఇద్దరిలో ఒకరికే పింఛన్‌ ఇస్తున్నారని.. మరొకరు ఆకలితో చావాలా అంటూ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ అమలు చేసిన అభయహస్తం పథకాన్ని అటకెక్కించారని, వారు చెల్లించిన డబ్బులు సైతం నొక్కేశారన్నారు. కేంద్రం పట్టించు కోకున్నా చివరిగింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తానన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడేమో వరి అంటేనే ఉరి పెట్టుకోవడమే అన్న చందంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డను నేను ప్రజలకు సేవ చేసేందుకే పార్టీని పెట్టా.. ఇక్కడే పుట్టిపెరిగా... ఇక్కడి వ్యక్తినే పెళ్లాడి కొడుకు, కూతురిని కన్నా... నా తెలంగాణ ప్రజల కోసం పోరుచేసి సంక్షేమపాలన అందిస్తానంటూ ఆమె ఆవేశపూరితంగా ప్రసం గించారు. ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, గ్రామాలకు బస్సులు రాక విద్యార్థులు, మహిళలు, చిరువ్యాపారులు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఇవేవీ ఈ ప్రభుత్వానికి పట్టడం లేదా అని నిలదీశారు. నాడు వైఎస్‌ ప్రభుత్వం పేద విద్యా ర్థులు ఉన్నత చదువులు చదవాలనే సంకల్పంతో తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారని గుర్తుచేశారు. కాగా ఈ యాత్ర దారిపొడ వునా రైతులు, కూలీలు వైఎస్‌ షర్మిలకు ఎదురొచ్చి సమస్యలు చెప్పుకున్నారు. అందరినీ ఆమె ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.అమృతాసాగర్‌, మాదగోని జంగయ్యగౌడ్‌, శ్రీనివాస్‌నాయక్‌, బూర జంగయ్యగౌడ్‌, కేసరి సాగర్‌, ఎన్నిదుల మహేష్‌, ఊడుగుల భాస్కర్‌గౌడ్‌, జయరాజ్‌ ఉన్నారు.Updated Date - 2021-10-30T04:10:32+05:30 IST