పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

ABN , First Publish Date - 2021-09-04T04:22:41+05:30 IST

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
మంచాల : ఆరుట్ల నూతన కార్యవర్గం సభ్యులు

  • టీఆర్‌ఎస్‌ మంచాల మండల అధ్యక్షుడు రమేష్‌

మంచాల: ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చీరాల రమేష్‌ పిలుపునిచ్చాడు. ఆరుట్లలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక కమిటీలే పార్టీకి పట్టుగొమ్మలని అన్నారు. అనంతరం ఆరుట్ల టీఆర్‌ఎస్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పున్నం రాము, ప్రధాన కార్యదర్శిగా బైకని మహేందర్‌, యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా కేశవ్‌, ప్రధాన కార్యదర్శిగా సుంకరి నిఖిల్‌గౌడ్‌, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కందాల బాష, ప్రధాన కార్యదర్శిగా ఆనంగళ్ల వేణు, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా ఆమంచ రంజిత్‌, కో-కన్వీనర్లుగా సతీష్‌, ఖాజాపాషా, బలం కిట్టు తదితరులున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కావలి శ్రీనివాస్‌, నాయకులు చిందం రఘుపతి, కందాల శ్రీశైలం, మార సురేష్‌, నూతనగంటి శేఖర్‌, ఎండీ.జానీపాషా, మొర్రి ఐలయ్య, చిందం జంగయ్య, వినోద్‌, సతీష్‌, రాజేష్‌, శ్రీకాంత్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీల ఎన్నిక 

కందుకూరు: అగర్‌మియాగూడ, సరస్వతీగూడ గ్రామాల టీఆర్‌ఎస్‌ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌లు తెలిపారు. శుక్రవారం ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మన్నె జయేందర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అగర్‌మియాగూడ అధ్యక్షుడిగా జి.యాదయ్య, ఉపాధ్యక్షులుగా ఎ.యాదయ్య, ఎన్‌ నర్సింహ, ప్రధాన కార్యదర్శిగా రమేష్‌, యువజన విభాగం అధ్యక్షుడిగా డి.అంజిరెడ్డి, బీసీ సెల్‌, మహిళా సెల్‌ అధ్యక్షులుగా ఎన్‌.రవీందర్‌, కె.కవితలను ఎన్నుకున్నట్లు తెలిపారు. సరస్వతీగూడ అధ్యక్షుడిగా బి.ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులుగా కె.పాండురంగారెడ్డి, ఎం.రవీందర్‌, ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీశైలం, బీసీ సెల్‌ అధ్యక్షుడిగా బి.భాస్కర్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు సురేందర్‌రెడ్డి, కృష్ణరాంభూపాల్‌రెడ్డి, లక్ష్మీనర్సింహరెడ్డి, అందుగుల సత్యనారాయణ, సర్పంచ్‌లు రాము, భూపాల్‌రెడ్డి, పీఎసీఎస్‌ వైస్‌చైర్మన్‌ జి.విజయేందర్‌రెడ్డి, డైరెక్టర్లు ఎస్‌.శేఖర్‌రెడ్డి, పొట్టి ఆనంద్‌, పారిజాతం, మండల నాయకులు బి.వెంకటేష్‌ సామయ్య, దీక్షిత్‌రెడ్డి, సదానంద్‌గౌడ్‌, రవికిరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T04:22:41+05:30 IST