1 నుంచి డీసెట్‌ అభ్యర్థులకు వెబ్‌ఆప్షన్లు

ABN , First Publish Date - 2021-10-30T04:15:49+05:30 IST

1 నుంచి డీసెట్‌ అభ్యర్థులకు వెబ్‌ఆప్షన్లు

1 నుంచి డీసెట్‌ అభ్యర్థులకు వెబ్‌ఆప్షన్లు

  • నేడు సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి అవకాశం

వికారాబాద్‌, అక్టోబరు29 (ఆంధ్రజ్యోతి): డీసెట్‌ -2021 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వచ్చేనెల ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాలని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్‌ కె.రామాచారి తెలిపారు. వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు 8నుంచి 10వ తేదీ వరకు సీట్లు కేటాయిస్తారన్నారు. 11నుంచి 15వ తేదీలోగా విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో 16వ తేదీలోగా చేరాలని చెప్పారు. కాగా, మొదటి విడతలో ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులు ఈనెల 30వ తేదీ, శనివారం వికారాబాద్‌ డైట్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు సూచించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2021-10-30T04:15:49+05:30 IST