మినీ స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తాం
ABN , First Publish Date - 2021-10-21T04:35:52+05:30 IST
మినీ స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తాం

- ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
మేడ్చల్ : మినీ స్టేడియాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మేడ్చల్ మున్సిపాలిటీ ఐదో వార్డు కౌన్సిలర్ నరసింహస్వామియాదవ్ తెలిపారు. బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘20 ఏళ్లుగా పూర్తికాని మినీస్టేడియం’ కథనానికి పాలకుల్లో కదలిక వచ్చింది. కౌన్సిలర్ పారిశ్రామిక వాడలోని మినీస్టేడియాన్ని సందర్శించి సిబ్బందితో పిచ్చిమొక్కలను తొలగించి మొరం పోసి పనులు చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతో మినీస్టేడియంలో రూ.50 లక్షలతో డ్రైనేజీ పనులు, పెవిలియన్‌ను అందంగా తీర్చిదిద్దడం, ప్రహరీ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే స్టేడియంలో టోర్నమెంట్ నిర్వహించే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.