పోడు రైతులకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2021-11-10T05:22:38+05:30 IST

పోడు రైతులకు న్యాయం చేస్తాం

పోడు రైతులకు న్యాయం చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: అటవీ భూముల్లో ఏళ్లుగా అనుభవదారులుగా గుర్తి ంచిన వారికి నిబంధనల మేరకు భూమిపై హక్కులు కల్పించేందుకు కృషిచేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిసన్‌రెడ్డి తెలిపారు. పోడు, అటవీ భూముల సంరక్షణపై మున్సిపాలిటీ పరిధి శేరిగూడలోని సీకే కన్వెన్షన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం లో ఆర్డీవో వెంకటాచారి, ఫారెస్టు రేంజ్‌ అధికారి విష్ణువర్ధన్‌రావు ఏసీపీ బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మె ల్యే రాములు పాల్గొన్నారు. ఏళ్ల నుంచి అటవీ భూముల్లో సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నవారికి న్యాయం చేయాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం  తీసుకుందన్నారు. అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అటవీ ప్రాంతం నుంచి రోడ్లకు సంబంధించి పెండింగ్‌ సమస్యలనూ పరిష్కరించేలా చూస్తామన్నారు. ఆర్డీవో వెంకటాచారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లో అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా 2005కు ముందు అటవీ భూముల్లో 670.65ఎకరాల్లో 712 మందిని ఆక్రమణదారులుగా గుర్తించామని తెలిపారు. గ్రామాల వారీ వివరాలను వెల్లడించారు. మంచాల మండలం రంగాపూర్‌లో 9.98ఎకరాల్లో 15 మంది, తిప్పాయిగూడలో 101.55ఎకరాల్లో 103 మంది, తాల్లపల్లిగూడలో 443.85 ఎకరాల్లో 236 మంది, హయత్‌నగర్‌ మండలం సాహెబ్‌నగర్‌లో 32.28 ఎకరాల్లో ఏడుగురు, ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో 10ఎకరాల్లో ఏడుగురు, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కుత్బుల్లాపూర్‌లో 15ఎకరాల్లో 11మంది, తట్టిఅన్నారంలో 58ఎకరాల్లో 333 మందిని ఆక్రమణదారులుగా గుర్తించామన్నారు. ఏవైనా అభ్యంతరాలున్నా, ఇంకా ఎక్కడైనా ఆక్రమణదారులు మిగిలి ఉన్నా వివరాలు తెలపాలని సూచించారు. సమావేశంలో మంచాల, యాచారం ఎంపీపీలు నర్మద, సుకన్య, అబ్దుల్లాపూర్‌మెట్టు జడ్పీటీసీ దాసు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట్‌, ఆదిభట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్లు స్రవంతి, స్వప్న, ఆర్తిక, ఇబ్రహీంపట్నం, మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్లు అనిత, దేవ్‌జా, వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నాయకులు క్యామ మల్లేష్‌, సత్తు వెంకటరమణారెడ్డి, అల్వాల వెంకట్‌రెడ్డి, సీపీఎం నుంచి యాదయ్య, సామేల్‌, బీజేపీ నాయకులు మర్పల్లి అంజయ్యయాదవ్‌, టీడీపీ ఆయకుడు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T05:22:38+05:30 IST