మామిడికి ఒకే ధర కల్పిస్తాం
ABN , First Publish Date - 2021-03-25T05:04:45+05:30 IST
మామిడికి ఒకే ధర కల్పిస్తాం

- మామిడి పంటను ప్రభుత్వమే కొంటుంది
- వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు
కులకచర్ల: రైతుల నుంచి అన్ని రకాల మామిడి కాయలు కొని ఒకేధర చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో పంటలపై అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గత సంవత్సరం కూడా మామిడి కాయలు కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఈ సారి కూడా అన్ని రకాల గ్రేడింగ్ కాయలకు ఒకే ధర చెల్లిస్తామన్నారు. మార్పులకు అనుగుణంగా రైతులు పంటల సాగుపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వరి సాగుతో పాటు కూరగాయలు, జొన్నలు, రాగులు, ఆకు కూరలు పండించాలని తెలిపారు. వచ్చే సీజన్‌లో మహిళా రైతు సంఘం హార్వెస్టర్ కొనుగోలు చేయాలని సూచించారు. కామునిపల్లిలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక, పీపీవీ పనులు పూర్తి చేయాలని సర్పంచ్ మైపాల్‌రెడ్డికి సూచించారు. డీఆర్‌డీవో క్రిష్ణణ్, జిల్లా ఉద్యాన వన అధికారి చక్రపాణి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, పీఆర్ డీఈ ఉమేశ్‌కుమార్, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఎంపీడీవో సుందర్, ఏపీఎం శోభ, ఏపీవో మల్లికార్జున్, ఉద్యానవనశాఖ అధికారి సంతోషిని, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.