పార్టీ పటిష్టతకు కృషి చేయాలి : మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2021-12-25T05:34:57+05:30 IST

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి : మంత్రి మల్లారెడ్డి

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి : మంత్రి మల్లారెడ్డి
రామస్వామిని అభినందిస్తున్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ మున్సిపల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా దుబ్బ రామస్వామిముదిరాజ్‌ను నియమించినట్లు మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డిలు శుక్రవారం ప్రకటించారు. కాగా, ఇప్పటివరకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న వంగేటి మాధవరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం విధితమే. దీంతో రామస్వామి ముదిరాజ్‌ను ఆయన స్థానంలో నియమించినట్లు వారు తెలిపారు. రామస్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన మంత్రి మల్లారెడ్డి, మహేందర్‌రెడ్డిలకు కృతఙ్ఞతలు తెలియజేశారు. అనంతరం పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు రామస్వామికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-25T05:34:57+05:30 IST