ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నాం
ABN , First Publish Date - 2021-05-09T05:04:53+05:30 IST
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నాం

- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ధారూరు: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భరంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతులకు మద్దతు ధరలను కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, సర్పంచ్ చంద్రమౌళి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇబ్రాహీం, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాములు, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, రైతులు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు ప్రారంభం
శామీర్‌పేట: రైతుల సౌకర్యార్ధమే వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు శామీర్‌పేట సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి అన్నారు. శనివారం శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ అలియాబాద్ గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అలియాబాద్ సర్పంచ్ కుమార్‌యాదవ్, ఉపసర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్‌యాదవ్, సొసైటీ డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ నాగమల్లరెడ్డి, నరేష్, కృష్ణారెడ్డి, బాలేశ్ పాల్గొన్నారు.