కొట్టుకుపోయిన మీరాపూర్ రోడ్డు
ABN , First Publish Date - 2021-07-09T05:11:49+05:30 IST
కొట్టుకుపోయిన మీరాపూర్ రోడ్డు

షాబాద్: చిన్నపాటి వర్షానికే మీరాపూర్ రోడ్డు కొట్టుకుపోయింది. గ్రామంలో దర్గా ఉండడంతో రంగారెడ్డి, హైదరాబాద్, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. మీరాపూర్‌కు రావడానికి ఇదే దారి. ఉన్న రోడ్డు కాస్తా కొట్టుకుపోవడంతో గ్రామస్తులు, భక్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ప్రతీ సంవత్సరం ఈ రోడ్డు కొట్టుకుపోతోంది. రోడ్డు నిర్మాణంలో నాణ్యతలేకే పాడవుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.