బసవేశ్వరుడి మార్గంలో నడవాలి

ABN , First Publish Date - 2021-12-31T04:45:55+05:30 IST

సమాజహితం కోసం బస వేశ్వరుడి చూపిన మార్గంలో

బసవేశ్వరుడి మార్గంలో నడవాలి
బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

  • మంత్రి సబితాఇంద్రారెడ్డి

చేవెళ్ల : సమాజహితం కోసం బస వేశ్వరుడి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. చేవెళ్ల మండలకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వర్‌ విగ్రహాన్ని గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీడీవో హరీశ్‌కుమార్‌, ఎంపీవో విఠలేశ్వర్‌, గ్రామ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, మాజీ వైస్‌ ఎంపీపీ జంగం శివానందం, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శేరిశివారెడ్డి, ఎంపీటీసీ సున్నపు వసంతం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం.శివలీల, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.ప్రభు లింగం, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-31T04:45:55+05:30 IST