జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2021-09-10T05:26:33+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక
- మంత్రి సబితాఇంద్రారెడ్డి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్) : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినా యక చవితి శుభాకాంక్షలు తెలుపుతు న్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. గురువారం ఆమె మాట్లా డుతూ.. విఘ్నాలు, కష్టాలు తొలగి శాంతి సౌఖ్యాలు నెలకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కరోనా నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించాలని విఘ్నేశ్వ రుడిని కోరుకుందామన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యా వరణాన్ని కాపాడుకుందామన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలన్నారు.