సీసీ రోడ్డు వేయాలని గ్రామస్థుల నిరసన

ABN , First Publish Date - 2021-07-13T05:12:19+05:30 IST

సీసీ రోడ్డు వేయాలని గ్రామస్థుల నిరసన

సీసీ రోడ్డు వేయాలని గ్రామస్థుల నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

పూడూరు: మండలంలోని మేడిపల్లికలాన్‌ గ్రామంలో సీసీ రోడ్లు వేయించాలని గ్రామస్థులు సోమవారం ఎడ్లబండితో నిరసన తెలిపారు. గ్రామంలో ఏవీధిలో చూసినా సీసీరోడ్డు లేక  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి సీసీరోడ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు వెంకట్‌రెడ్డి, నర్సింహులు, రవి, మహ్మద్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:12:19+05:30 IST