తప్పించుకున్న దారిదోపిడీ ముఠా సభ్యుడిని పట్టుకున్న గ్రామస్థులు
ABN , First Publish Date - 2021-10-30T04:46:19+05:30 IST
తప్పించుకున్న దారిదోపిడీ ముఠా సభ్యుడిని పట్టుకున్న గ్రామస్థులు

నవాబుపేట: ఇటీవల దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాలో ఆరుగురు ముఠాసభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా అందులో నుంచి ఓముఠా సభ్యుడు పారిపోవడంతో పోలీసులు అక్కడక్కడా చెక్‌పోస్టులు నిర్వహించి తనిఖీలు నిర్వహించారు. తప్పించుకున్న ముఠా సభ్యుడు శుక్రవారం శంకర్‌పల్లి మండలంలోని అలా్ట్ర టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ పత్తేపూర్ గ్రామస్థులకు కనిపించాడు. అప్రమత్తమైన గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని శంకర్‌పల్లి పోలీసులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న మండలప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో దారిదోపిడీలు జరుగుతున్న సంఘటనలు విని రాత్రి 7గంటలు దాటితే ఈమార్గం గుండా బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురయ్యేవారిమని ముఠా అరెస్టుతో ఉపశమనం లభించిందని గ్రామస్థులు తెలిపారు. దోపిడీలకు పాల్పడ్డ ముఠాసభ్యులను కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.