ఫార్మేషన్‌ రోడ్లకే ప్రథమ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-02-06T04:57:34+05:30 IST

ఫార్మేషన్‌ రోడ్లకే ప్రథమ ప్రాధాన్యం

ఫార్మేషన్‌ రోడ్లకే ప్రథమ ప్రాధాన్యం
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీచైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి

వికారాబాద్‌ జడ్పీచైర్మన్‌ సునీతామహేందర్‌రెడ్డి

మర్పల్లి: రైతుల పొలాలకు వెళ్లే ఫార్మేషన్‌ రోడ్లకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మర్పల్లి మండల పరిధిలోని వివిధ గ్రాల్లో శుక్రవారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి రూ.1.09 కోట్ల వ్యయంతో చేపట్టిన  సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, ఇతర పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మర్పల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. లైన సిరిపురం, కొత్లాపురం, పంచలింగాల్‌, నర్సాపూర్‌, గుండ్లమర్పల్లి, పిల్లిగుండ్ల, పట్లూరు, ఘనాపూర్‌, మొగలిగుండ్ల, మర్పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్క మండలానికి రూ.కోటి నిధులు ఇస్తే వాటిలో రూ.60లక్షల వరకు ఫార్మేషన్‌ రోడ్లకే కేటాయిస్తున్నామని ఆమె అన్నారు. దీంతో రైతుల పంటలు సులువుగా ఇళ్లకు చేరుతాయని అన్నారు.   భూములకు విలువ పెరుగుతుందన్నారు.   ఎమ్మెల్యే మెతుకుఆనంద్‌ మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా పింఛన్‌, రేషన్‌ కార్డుల ఇబ్బందులు ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, ఎంపీపీ లలితారమేష్‌, జడ్పీటీసీ మధుకర్‌, మార్కెట్‌ చైర్మన్‌ మల్లేషం, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రవీన్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు నాయబ్‌గౌడ్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సంగీత, సర్పంచులు మల్లేషం, సురేందర్‌రెడ్డి, ఇందిరాఅశోక్‌, మహబూబ్‌అబీ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:57:34+05:30 IST