రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో వికారాబాద్‌ జట్టు విజయం

ABN , First Publish Date - 2021-11-03T05:01:05+05:30 IST

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో వికారాబాద్‌ జట్టు విజయం

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో వికారాబాద్‌ జట్టు విజయం

తాండూరు: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో జరుగుతున్న అండర్‌-25 విభాగం స్టేట్‌లెవల్‌లో జరుగుతున్న టోర్నమెంట్‌లో రంగారెడ్డి జిల్లా జట్టుపై వికారాబాద్‌ జిల్లా జట్టు 123పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వికారాబాద్‌ జట్టు 47.1 ఓవర్‌లో 258 పరుగులు చేసింది. అనంతరం రంగారెడ్డి జట్టు 135 పరుగులకు ఆల్‌ఔట్‌ అయింది. వినయ్‌ 94 పరుగులు చేయగా, కల్యాణ్‌పవార్‌ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.  

Updated Date - 2021-11-03T05:01:05+05:30 IST