వీరశైవ సమాజాభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-10-29T05:13:34+05:30 IST
వీరశైవ సమాజాభివృద్ధికి కృషి చేయాలి

వికారాబాద్, (ఆంధ్రజ్యోతి): వీరశైవ సమాజాభివృద్ధికి కొత్తగా ఎన్నికైన కార్యవర్గం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. మల్లికార్జున భవన్‌లో బుధవారం రాత్రి జరిగిన వీరశైవ సమాజం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం కొత్త కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. సమాజం అధ్యక్షుడిగా కె.విజయకుమార్, ఉపాధ్యక్షుడిగా ఎం.బిచ్చప్ప, కార్యదర్శిగా వై.విద్యాసాగర్, సహాయ కార్యదర్శిగా విశ్వం పంతులు, కోశాధికారిగా సీహెచ్.విజయకుమార్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. అనంతరం కొత్త, పాత కార్యవర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్.బసవరాజ్, ఎ.నాగరాజు, సమాజం బాఽధ్యులు పటేల్ మల్లేశం, ఎస్.ఆత్మలింగం, డాక్టర్ ముద్ద భక్తవత్సలం, చెక్క వీరన్న, వీరేషం, కౌన్సిలర్లు సుధాంష్ కిరణ్ పటేల్, నవీన్‌కుమార్, పార్వతయ్యస్వామి, గాండ్ల వీరేశం, ప్రభాకర్, సుధాకర్, జొన్నల రవిశంకర్, ప్రశాంత్, ప్రదీప్, ఉమాకాంత్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా ఎ.వీరకాంతం, కె.సంతోష్‌కుమార్, బి.నాగరాజు వ్యవహరించారు.