పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2021-12-07T05:31:24+05:30 IST

పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించాలి

పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించాలి
ధర్నా చేస్తున్న బీజేపీ, కిసాన్‌ మోర్చా నాయకులు

వికారాబాద్‌: పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గించాలని కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 3కోట్ల మంది రైతులున్నారని, 68లక్షల హెక్టార్లలో పంట పండిస్తున్నారని, పెట్రో ధరలపై వ్యాట్‌ తగ్గిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో శివరాజ్‌, పాండుగౌడ్‌, విజయ్‌భాస్కర్‌, రాఘవనాయక్‌, శంకర్‌, వెంకటయ్య, నరోత్తంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, విజయరాజ్‌, వివేకానందరెడ్డి, చరణ్‌  పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:31:24+05:30 IST