దూడల్లో బ్రుసెల్లోసిస్‌ నివారణకు టీకాలు

ABN , First Publish Date - 2021-08-20T05:42:36+05:30 IST

దూడల్లో బ్రుసెల్లోసిస్‌ నివారణకు టీకాలు

దూడల్లో బ్రుసెల్లోసిస్‌ నివారణకు టీకాలు
దూడకు టీకా వేస్తున్న చైర్‌పర్సన్‌ ముల్లి పావని

ఘట్‌కేసర్‌: పాడి పశువుల పెంపకందారులు నాలుగు నుంచి ఆరు నెలల వయసున్న దూడలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని జంగయ్య అన్నారు. గురువారం కొండాపూర్‌లో దూడలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. దూడలతోపాటు గొర్రె, మేక పిల్లలకు సంక్రమించే బ్రుసెల్లోసీస్‌ వ్యాధిని నిర్ములించేందుకు ప్రభుత్వం బ్రుసెల్లో టీకాలు వేస్తోందన్నారు. ఆడ దూడలకే టీకాలు వేస్తున్నట్టు పశువైద్యాధికారి పద్మిని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు సైతం వ్యాధి సోకుతుందన్నారు. దూడలకు బ్రుసెల్లోసిస్‌ వ్యాధి నివారణ కోసమే టీకాలు వేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల రైతు సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ సింగిరెడ్డి రాంరెడ్డి, వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డి, కౌన్సిలర్‌ సీహెచ్‌.వెంకట్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T05:42:36+05:30 IST