పట్టణ ప్రగతి మున్సిపాలిటీల అభివృద్ధికి దోహదం
ABN , First Publish Date - 2021-07-09T05:18:20+05:30 IST
పట్టణ ప్రగతి మున్సిపాలిటీల అభివృద్ధికి దోహదం

- రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య డైరెక్టర్, కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ
ఆమనగల్లు: పట్టణ ప్రగతి కార్యక్రమం మున్సిపాలిటీల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, సమస్యలు సత్వరంగా పరిష్కారమవుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య డైరెక్టర్, కమిషనర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ప్రజల సహకారంతోనే ప్రగతి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో గురువారం ఆయన పర్యటించారు. నర్సరీ, పట్టణ ప్రకృతి వనం, శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌ను, పారిశుఽధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. పట్టణప్రగతిలో చేపడుతున్న కార్యక్రమాల గురించి కమిషనర్ శ్యాంసుందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అలసత్వానికి తావుండకూడదని, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గానికి సూచించారు. జాతీయ రహదారి పక్కన, పట్టణప్రకృతి వనంలో సత్యనారాయణ మొక్కలు నాటారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డీఏంఏ శ్రీనివాసులు, ఏఈ భార్గవరెడ్డి, కౌన్సిలర్ సుజాతరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.