‘అనుమతి లేని వైన్స్‌ను తొలగించాలి’

ABN , First Publish Date - 2021-12-07T05:33:58+05:30 IST

‘అనుమతి లేని వైన్స్‌ను తొలగించాలి’

‘అనుమతి లేని వైన్స్‌ను తొలగించాలి’

కొడంగల్‌: పంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. రావుల్‌పల్లిలో కోర్టు కేసులో ఉన్న భూమిలో వైన్స్‌ ఏర్పాటు సరికాదన్నారు. భూ యజమాని చనిపోయినా అగ్రిమెంట్‌ లేకుండా కంటైనర్‌లో వైన్స్‌ను ఏర్పాటు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వైన్స్‌పై కలెక్టర్‌, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-12-07T05:33:58+05:30 IST