రెండు రైల్వే ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-21T05:15:20+05:30 IST

రెండు రైల్వే ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

రెండు రైల్వే ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

బషీరాబాద్‌: రెండు వేర్వేరు రైలు ప్ర మాదాల్లో మృతిచెందిన సంఘటన బషీరాబాద్‌ మండలం నవాంద్గి రైల్వేస్టేషన్‌ పరి ధిలో బుధవారం జరిగింది. వివరాలిలా ఉ న్నాయి. జీవన్గి వీఆర్‌ఏ భీమప్ప(61) మం గళవారం రాత్రి పొలానికి కాపలా వెళ్తూ రై లుపట్టాలు దాటే క్రమంలో గూడ్సు రైలు ఢీకొని మృతిచెందాడు. రైల్వే పోలీసుల అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్‌(21) అనే యువకుడు హైదరాబాద్‌ నుంచి ఫలక్‌నుమా-వాడి ప్యాసింజర్‌ ట్రెయిన్‌లో వెళ్తూ డోర్‌ వద్ద నిల్చున్నా డు. నవాంద్గి స్టేషన్‌ సమీపంలో జారి పడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో మొదట తాండూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-21T05:15:20+05:30 IST