రెండు వాహనాలు ఢీ.. వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2021-11-06T05:01:18+05:30 IST
రెండు వాహనాలు ఢీ.. వ్యక్తి దుర్మరణం

షాద్‌నగర్ రూరల్: షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా ముగ్గురు గాయపడినట్టు ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపారు. నందిగామ మండలం చేగూరుకు చెందిన వరుణ్(20), రాజేశ్ (20) బుల్లెట్ బండిపై షాద్‌నగర్ వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆస్పత్రి సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన స్కూటీ ఢీ కొంది. దీంతో వరుణ్ మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వరుణ్ సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.