రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు గాయాలు

ABN , First Publish Date - 2021-12-31T05:11:49+05:30 IST

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు గాయాలు

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు గాయాలు

మొయినాబాద్‌ రూరల్‌: రెండు లారీలు ఢీకొన్న ప్ర మాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హిమాయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున రెండు లారీలు సెల్లర్‌ కోసం తవ్విన మట్టిని నగరం నుంచి చిలుకూరు వైపునకు తరలిస్తున్నారు. లారీలు హిమాయత్‌నగర్‌లో వెనకాల నుంచి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒక లారీలోని డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా గ్రామస్థుల బయటకుతీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ప్రమాదానికి లారీల అతివేగమే కారణమని.. నిత్యం ఈ రోడ్డుపైనుంచి మట్టిని తరలించే లారీలు అడ్డూఅదుపు లేకుండా వెళ్తుంటాయని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2021-12-31T05:11:49+05:30 IST