టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కసిరెడ్డి నామినేషన్‌ దాఖలు

ABN , First Publish Date - 2021-11-24T04:58:30+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కసిరెడ్డి నామినేషన్‌ దాఖలు
నామినేషన్‌ వేస్తున్న కసిరెడ్డి

ఆమనగల్లు : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళ వారం నామినేషన్‌ వేశారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌కు కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. కల్వకుర్తి నియోజక వర్గంలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. నామినేషన్‌ కార్యక్రమానికి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల, వెల్దండ, కల్వకుర్తి మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ హాజరుకాక పోవడం పై పలువురు పలు విధా లుగా చర్చించుకుంటున్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు అనితవిజయ్‌, కమ్లీమోత్యనాయక్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీ సింగ్‌, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌కుమార్‌, నాయకులు సూదిని కొండల్‌రెడ్డి, వస్పుల జంగయ్య, గూడూరు భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్‌, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పురుషోత్తం, గణేశ్‌గుప్త, శాంతిగోపాల్‌ పాల్గొన్నారు. Updated Date - 2021-11-24T04:58:30+05:30 IST