కల్తీ కల్లు కేసులో మరో ఏడుగురు అరెస్టు

ABN , First Publish Date - 2021-01-21T04:55:12+05:30 IST

కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్‌ పోలీసులు ఇప్పటివరకు మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కల్తీ కల్లు కేసులో మరో ఏడుగురు అరెస్టు

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి : కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్‌ పోలీసులు ఇప్పటివరకు మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇది వరకు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, బుధవారం ఏడుగురిని అరెస్టు చేసి వారి వివరాలను ఎక్సైజ్‌ ఎస్‌ఐ జాఫర్‌ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు.  జైపాల్‌ (మమ్మదాన్‌పల్లి), పాండు (పెండ్లిమడుగు), నరేష్‌ (పులుసుమామిడి), శ్రీనివాస్‌ (ఆర్కతల), నాగేష్‌ (ఎకమామిడి), సాయికుమార్‌ (ఎర్రవల్లి), మధుకర్‌ (వట్టిమీనపల్లి)లను అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని ఎక్సైజ్‌ ఎస్‌ఐ చెప్పారు.  

Updated Date - 2021-01-21T04:55:12+05:30 IST