నేటి ఓటమి రేపటి విజయానికి నాంది
ABN , First Publish Date - 2021-10-22T05:20:29+05:30 IST
నేటి ఓటమి రేపటి విజయానికి నాంది

ఆమనగల్లు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. ఆమనగల్లులో పోలీసు శా ఖ మూడు రోజులుగా నిర్వహించిన వాలీబాల్ టోర్నీ, బ్యాడ్మింటన్ పోటీ లు గురువారం ముగిశాయి. వాసవీ కల్యాణ మండపంలో సీఐ అధ్యక్షతన ముగింపు సమావేశం నిర్వహించారు. వాలీబాల్‌లో శెట్టిపల్లి సత్యం టీం, దే వునిపడకల్ టీంల మధ్య పైనల్ మ్యాచ్ జరుగగా శెట్టిపల్లి గెలిచింది. మూ డో స్థానంలో కేశంపేట నిలిచింది. బ్యాడ్మింటన్ పోటీల్లో ఆమనగల్లు బ్యా డ్మింటన్ క్లబ్ విజయ్, శ్రీశైలం టీం, రెండో బహుమతి ఏబీఏ, మూడో బహుమతి కల్వకుర్తి గెలుచుకున్నాయి. విజేతలకు నగదు, షీల్డ్‌లను ఏసీపీ కుషాల్కర్ బహుకరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు ధర్మేశ్, వరప్రసాద్, హరిశంకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, ఎంపీటీసీ కు మార్, లయన్స్‌క్లబ్ ఉపాధ్యక్షుడు రాము, నాయకులు ఎగిరిశెట్టి సత్యం, శ్రీ ను, పత్యనాయక్, రమేశ్‌నాయక్, శంకర్, కృష్ణనాయక్ పాల్గొన్నారు.