పశువులను రక్షించబోయి.. చెరువులో మునిగి రైతు మృతి

ABN , First Publish Date - 2021-10-14T05:31:10+05:30 IST

పశువులను రక్షించబోయి.. చెరువులో మునిగి రైతు మృతి

పశువులను రక్షించబోయి.. చెరువులో మునిగి రైతు మృతి

కందుకూరు: మండల పరిధిలోని పులిమామిడి గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు సౌడమ్మ చెరువులో మునిగి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. పులిమామిడికి చెందిన నారాయణ(48) బుధవారం పాడి గేదెలను మేపడానికి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి తరలించాడు. అవి మేత మేస్తూ పక్కనే ఉన్న సౌడమ్మ చెరువులోకి వెళ్లాయి. ఈ క్రమంలో నారాయ ణ వాటిని బయటకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా నీటిలో మునిగి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఫైర్‌ సిబ్బంది సాయంతో నారాయణ మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-14T05:31:10+05:30 IST