చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-11-03T04:58:45+05:30 IST

చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి

చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి
పొల్కంపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు, విద్యార్థులు

ఇబ్రహీంపట్నం రూరల్‌: చట్టాలపై ప్రజలకు అవగాహన ఉన్నప్పుడే వారికి తగిన న్యాయం జరుగుతుందని ఇబ్రహీంపట్నం జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజు అన్నారు. మంగళవారం పొల్కంపల్లిలో పాన్‌ ఇండియా అవేర్నె్‌సలో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నప్పుడే ప్రతి సమస్యకు సమస్య మార్గాలు సులభంగా దొరుకుతాయని అన్నారు. రాజీపడదగిన కేసుల్లో రాజీ చేసుకుంటే ఇరుపక్షాలకు న్యాయం జరుగుతుందన్నారు. సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కలమాలు వదిలి కలిసి జీవించడానికి ప్రయత్నించాలని కోరారు. ర్యాలీలో గ్రామస్థులు, విద్యార్థులు ప్లకార్డులతో ప్రచారం చేశారు. న్యాయవాదులు జగన్‌గౌడ్‌, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T04:58:45+05:30 IST