టిప్పర్‌-బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-03T04:39:52+05:30 IST

టిప్పర్‌-బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి

టిప్పర్‌-బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి
ప్రమాదంలో మృతి చెందిన శ్రీనివాస్‌

ధారూరు: టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని మున్నూర్‌ సోమారం-బుగ్గ రామేశ్వరం రోడ్డు మార్గంలో ఆదివారం జరిగింది. కొండాపూర్‌కలాన్‌ గ్రామానికి చెందిన వడ ్ల శ్రీనివాస్‌(35) బైక్‌పై వికారాబాద్‌ వైపు వెళ్తుండగా మున్నూర్‌ సోమారం గేట్‌ దాటిన తర్వాత వికారాబాద్‌ నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ గాయాలపాలై తీవ్రరక్తశ్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ పరామర్శ

టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జె.హన్మంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు శుభప్రద్‌ పటేల్‌లు వికారాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి వెళ్లి మృతుడు శ్రీనివాస్‌ సోదరుడైన వడ్ల నందును, కుటుంబసభ్యులను పలకరించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున తగు న్యాయం జరిగే విధంగా చూస్తామని వారు హమీ ఇచ్చారు. 

Updated Date - 2021-05-03T04:39:52+05:30 IST