రెండు దుకాణాల్లో చోరీ

ABN , First Publish Date - 2021-12-27T05:07:50+05:30 IST

రెండు దుకాణాల్లో చోరీ

రెండు దుకాణాల్లో చోరీ

షాద్‌నగర్‌ రూరల్‌: షాద్‌నగర్‌ చౌరస్తాలోని రెండు దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి సీసీ కెమెరాల వైర్లను తొలగించి దొంగతనం చేశారు. పరిగి రోడ్డు వైపు ఉన్న స్టాండర్డ్‌ హార్డ్‌వేర్‌, లతీఫ్‌ సైకిల్‌ స్టోర్స్‌ వెనుక వైపు గ్రిల్స్‌ను తొలగించారు. హార్డ్‌వేర్‌లో రూ.11వేలు, సైకిల్‌ స్టోర్స్‌లో సామాన్లు దొంగలించుకుపోయారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-27T05:07:50+05:30 IST