చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-01-13T05:44:34+05:30 IST

చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలి

చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అవగహన సదస్సులో మాట్లాడుతున్న పోలీసులు

కొత్తూర్‌: సంక్రాతి పండు గకు ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లే ప్రజలు చోరీ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సయూద్‌ తెలిపా రు. కొత్తూరులో మంగళవా రం అవగాహన సదస్సు నిర్వహించారు. పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బంగారు అభరాణాలు తమ వెంట తీసుకుపోవాలని, లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవా లన్నారు. ఇంటికి సెంటర్‌లాక్‌ వేసి తోటివారికి సమాచారం ఇవ్వాలన్నారు. 

వైన్‌షాప్‌లో చోరీ

మండల కేంద్రంలోని పాతజాతీయ రహదారి పక్కన గల కనకదుర్గ వైన్‌ షాప్‌లో సోమవా రం దొంగలు మద్యం సీసాలతో పా టు నగదును దోచుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వైన్స్‌ పైభాగంలోని రేకులను కట్‌ చేసి ప్రవేశించి 15వేల రుపాయల విలువ గల మద్యంతో పాటు 13వేల రూపాయలు ఎత్తుకుపోయారని తెలిపారు. షాప్‌ యాజమాని విజయ్‌గౌ డ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-13T05:44:34+05:30 IST