అన్నను హతమార్చిన తమ్ముడు

ABN , First Publish Date - 2021-11-01T04:56:24+05:30 IST

ఇంట్లో వాటా కావాలని అన్నను తమ్ముడు కత్తితో

అన్నను హతమార్చిన తమ్ముడు
యాదగిరి మృతదేహం

  • ఇంట్లో వాటా కోసం లారీలో వెళ్తుండగానే కత్తితో పొడిచి చంపిన వైనం

శంషాబాద్‌ రూరల్‌: ఇంట్లో వాటా కావాలని అన్నను తమ్ముడు కత్తితో పొడిచి చంపిన సంఘటన శంషాబాద్‌ మండలపరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ ప్రకా్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా పెద్దమందడి మం డలం అల్వాల్‌ గ్రామానికి చెందిన యాదగిరి, శ్రీనివాస్‌ అన్నదమ్ములు. ఇద్దరూ లారీడ్రైవర్లు. వారి తండ్రి ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చేశాడు. ఇటీవల యాదగిరి కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అయితే కొత్త ఇంట్లో తనకూ వాటా కావాలని శ్రీనివాసులు అన్నతో కొన్నాళ్లుగా గొడవపడుతున్నాడు. ఆదివారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లి నుంచి అన్నదమ్ములు, మరో ముగ్గురు కలిసి కొరియర్‌ కంటైనర్‌తో మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో గండిగూడ వద్దకు రాగానే లారీలో ఉన్న యాదగిరిని శ్రీనివాస్‌ కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. యాదగిరికి భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.Updated Date - 2021-11-01T04:56:24+05:30 IST