భర్తను హత్య చేసిన భార్య
ABN , First Publish Date - 2021-10-26T04:13:24+05:30 IST
భర్తను హత్య చేసిన భార్య

- వేధింపులే కారణమని పోలీసుల వెల్లడి
షాద్‌నగర్‌రూరల్: వేధింపులు భరించలేక భర్తను భార్య హత్య చేసిన ఉదంతం షాద్‌నగర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధర్రాతి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఫరూఖ్‌నగర్ మండల పరిధి రంగంపల్లి గ్రమానికి చెందిన దుర్గం నర్సింహులు (45) మద్యానికి బానిసై భార్య హంసమ్మను వేధింపులకు గురి చేసేవాడు. ఆదివారం కూడా వేధింపులకు గురి చేయడంతో సహనం కోల్పోయిన ఆమె భర్త నిద్రిస్తున్న సమయంలో తలపై గ్రానేట్ రాయితో మోది హత్య చేసింది. కాగా, మృతుడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు హంసమ్మను అదుపులోకి తీసుకుని నర్సింహులు మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్పు చేస్తున్నట్లు సీఐ నవీన్‌కుమార్ తెలిపారు.