అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం
ABN , First Publish Date - 2021-10-29T05:08:16+05:30 IST
అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం

కీసర రూరల్: పాఠశాలకు వెళ్లిన బాలుడు అదృశ్యమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రత్యక్షమైన ఘట న గురువారం చోటు చేసుకుంది. కీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం.. నాగారం మున్సిపాలిటీ ఆర్‌ఎల్‌నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి కుమారుడు ధీరజ్‌రెడ్డి ఏఎ్‌సరావు నగర్‌లోని భాష్యం స్కూల్లో చదువుకుంటున్నాడు. బుధవారం స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత మీ అబ్బాయి పాఠశాలకు రాలేదని స్కూల్ సిబ్బంది ధీరజ్ తల్లితండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమందించారు. వారు తెలిసిన వారి వద్ద, ధీరజ్ మిత్రులను సంప్రదించినా ఫలితం లేకపోవటంతో పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బస్టాండు నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్న ఓ కండక్టర్ ధీరజ్ తండ్రికి ఫోన్ చేసి మణుగూరు బస్టాండులో కనిపించాడని చెప్పగా, కండక్టర్ సాయంతో ధీరజ్ గురువారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు.