అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-10-14T05:36:57+05:30 IST

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హైమాస్ట్‌ లైట్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

  • ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌


కొందుర్గు/షాద్‌నగర్‌అర్బన్‌: అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఉత్తరా్‌సపల్లిలో సీడీఎఫ్‌ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగయ్య, వైస్‌ ఎంపీపీ రాజేష్‌ పటేల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌ జహురాభీ, ఎంపీటీసీ భారతమ్మ, సర్పంచులు శ్రీధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నర్సింహులు, రాంరెడ్డి, లింగమయ్యగౌడ్‌, నాయకులు సయ్యద్‌ హఫీజ్‌, మోహన్‌రెడ్డి, జహంగీర్‌, శేఖర్‌, అలీం, మాజీద్‌, ఇబ్రహీం పాల్గొన్నారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ 2వ వార్డులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను బుధవారం రాత్రి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ నటరాజ్‌, మాజీ చైర్మన్‌ అగ్గనూరి విశ్వం, కౌన్సిలర్‌ పావనినర్సింహ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-14T05:36:57+05:30 IST