కారును ఢీకొట్టిన లారీ
ABN , First Publish Date - 2021-12-27T05:10:34+05:30 IST
కారును ఢీకొట్టిన లారీ

- కుటుంబానికి త్రుటిలో తప్పిన ముప్పు
చేవెళ్ల: అతివేగం, అజాగ్రత్తతో లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జకాగా అందులో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చేవెళ్ల వద్ద హైదరాబాద్-బీజాపూర్ రోడ్డుపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పరిగి ప్రాంతానికి చెందిన శ్రీధర్‌రెడ్డి తన కొత్త కారులో భార్య సబిత, తల్లి అనంతమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కుచేవెళ్ల మీదుగా వెళ్తున్నారు. తాండూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ చేవెళ్ల వద్ద కారును వెనుకనుంచి ఢీకొంది. దీంతో కారు డివైడర్‌ను ఢీకొని వెనక్కు తన్నింది. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు చేరుకొని కారులోని వారిని బయటకు తీశారు. వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.