మార్వాడీ యువమంచ్ సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2021-12-10T05:04:23+05:30 IST
మార్వాడీ యువమంచ్ సేవలు అభినందనీయం

తాండూరు : మార్వాడీ యువమంచ్ సేవలు అభినందనీయమని జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో జరిగిన కృత్రిమ అవయమాల అమర్చే శిబిరాన్ని ఆమె సందర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, ఆర్డీవో అశోక్‌కుమార్, డీఆర్డీఏ ఏపీవో లక్ష్మీ, కౌన్సిలర్లు రజాక, ముక్తార్‌నాజ్, జుబేర్‌లాలా, రవి, శోభారాణి, మంచ్ కన్వీనర్ కుంజ్‌బిహారీ సోని, రాష్ట్ర కన్వీనర్ అనిల్ సార్డా, క్యాంప్ చైర్మన్ సునీల్ సార్డా, మంచ్ అధ్యక్షుడు సన్నిఅగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్‌పర్సన్‌కు మంచ్ ప్రతినిధులు మెమొంటోను అందజేశారు. కాగా, శిబిరంలో 105 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలను అమర్చినట్లు మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్‌సార్డా తెలిపారు.