ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-22T05:01:43+05:30 IST
ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం

షాబాద్ : ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల ప్రఽధాన లక్ష్యమని షాబాద్ ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా షాబాద్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం పోలీ్‌సస్టేషన్ ఆవరణలో క్రికెట్, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు భద్రత కల్పించడమే పోలీసుల ప్రఽధాన లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకుని సమాజానికి ఉపయెగపడే పనులు చేపట్టాలన్నారు. ప్రాణాలకు తెగించి సేవలందించే పోలీసులకు నేరాల అదుపులో ప్రజలు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.