ఆశాలకు పీఆర్‌సీ అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-09-03T04:44:57+05:30 IST

ఆశాలకు పీఆర్‌సీ అమలు చేయాలి

ఆశాలకు పీఆర్‌సీ అమలు చేయాలి
పీహెచ్‌సీ డాక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న ఆశా కార్యకర్తలు

  • సీఐటీయూ జిల్లా నాయకుడు బీసా సాయిబాబా 

కొత్తూర్‌: ఆశాలకు పెంచిన 30శాతం పీఆర్‌సీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు బీసా సాయిబాబా డిమాండ్‌ చేశారు. గురువారం ఆశాలతో కలిసి స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ కవితకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ పీఆర్‌సీని పెంచిన ప్రభుత్వం మూడు నెలల కావస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఈనెల 6న కలెక్టర్‌ కార్యాలయ ముట్టడిని చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆశాలు నవనీత, సంతోష, వసంత, జహంగీర్‌బీ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-09-03T04:44:57+05:30 IST