ఎంఎ్‌సఈఎ్‌ఫసీ పనితీరు భేష్
ABN , First Publish Date - 2021-10-30T04:23:21+05:30 IST
ఎంఎ్‌సఈఎ్‌ఫసీ పనితీరు భేష్
- రాజస్థాన్ పరిశ్రమల శాఖ అధికారుల కితాబు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (ఎంఎ్‌సఈఎ్‌ఫసీ) రంగారెడ్డి రీజియన్ పనితీరు బాగుందని రాజస్థాన్ రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల బృందం కితాబిచ్చింది. శిక్షణలో భాగంగా రాజస్థాన్ అధికారుల బృందం శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. 2018 ఆగస్టు నుంచి రంగారెడ్డి రీజియన్ ఎంఎ్‌సఈఎ్‌ఫసీని నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమలశాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. చిన్న పరిశ్రమల ఉత్పత్తులు, సేవలు, చెల్లింపుల గురించి అధికారులకు వివరించారు. హైదరాబాద్ కో-ఆర్డినేటర్ సూర్య ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.